ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, అలాగే చర్మం మెరిసేలా చేస్తుందని పేర్కొంటున్నారు. బరువును తగ్గించి, రోగనిరోధక వ్యవస్థను పెంచుతుందట. క్యాన్సర్ లాంటి సీరియస్ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుందని సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి శక్తి కేంద్రంగా పనిచేస్తాయట.