రోజూ సాయంత్రం స్వీట్ కార్న్ తింటే ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉడకబెట్టి లేదా సూప్స్, సలాడ్స్ చేసుకుని తినవచ్చు. దీనిలో విటమిన్ బి1, బి9, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చూస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. స్వీట్ కార్న్ డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.