బీట్‌రూట్‌ను అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్‌ను తింటే.. రాళ్లు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అలర్జీ సమస్యలు ఉన్నవారు దీనిని తింటే చర్మంపై దురద, గొంతు సమస్య, వాపు వంటి సమస్యలు వస్తాయి. జీర్ణసమస్యలు ఉన్న వారు దీని జ్యూస్ తాగడం వల్ల కడుపులో నొప్పి, డయేరియా, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే చాన్స్ ఉంది.