మటన్‌తో చేసే వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే మటన్ ఎక్కువగా తింటే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పదేళ్ల పాటు దీనిపై అధ్యయనం చేశారు. సహజ ఇన్సులిన్‌ను మటన్‌లో ఉండే హానికారక శాచురేటెడ్ కొవ్వులు అడ్డుకుంటున్నట్లు వారు గుర్తించారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ మటన్ తినే వారిలో ఇది ఎక్కువ అని వారు పేర్కొంటున్నారు.