పుచ్చకాయ గింజలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణలు చెబుతున్నారు. 'పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్ , ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.' అని అంటున్నారు.