ఆర్థిక సర్వే ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతంటే..

53చూసినవారు
ఆర్థిక సర్వే ప్రకారం  భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతంటే..
బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆర్థిక సర్వేను ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, రాబోయే కేంద్ర బడ్జెట్‌ అంచనాలను ఆర్థిక సర్వే హైలైట్ చేసింది. 2026 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8 శాతం వరకూ ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.