ముగిసిన ఐఏఎస్‌ అధికారి ఈడీ విచారణ

61చూసినవారు
ముగిసిన ఐఏఎస్‌ అధికారి ఈడీ విచారణ
IAS అధికారి అమోయ్‌కుమార్‌ ఈడీ విచారణ బుధవారం ముగిసింది. ఉ. 10 గంటల నుంచి సా. 6 గంటల వరకు అమోయ్‌కుమార్‌ ను అధికారులు విచారించారు. దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా అమోయ్‌ను ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో భూముల కేటాయింపులో అక్రమాలపై అమోయ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. మహేశ్వరం(M) నాగారంలో భూదాన్‌ భూముల బదిలీపై ఈడీ విచారణ చేపట్టింది. రూ. వందల కోట్ల విలువైన 42 ఎకరాలు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్