ఈడీని రద్దు చేయాలి: అఖిలేశ్‌ యాదవ్

66చూసినవారు
ఈడీని రద్దు చేయాలి: అఖిలేశ్‌ యాదవ్
ఈడీని రద్దు చేయాలని మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ ఆర్థిక సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు అనేక సంస్థలు ఉండగా ఈడీతో అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలోనే ‘ఈడీ’ ఏర్పాటైందని, ఇప్పుడు దానివల్లే ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్