గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేద పిల్లలకు విద్య అందించడమే లక్ష్యంగా 10రేట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. సమాజానికి విద్య, వైద్యం రెండు కళ్లు లాంటివి అని తెలిపారు. ఈ రెండు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.