యూనివర్సిటీల్లో ఆచార్యులు, ఉపకులపతుల నియమాకాలపై యూజీసీ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా నిబంధనలపై తెలంగాణ విద్యా కమిషన్ రేపు సదస్సు నిర్వహించనుంది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఆచార్యులు హరగోపాల్, కోదండరాం, తిరుపతిరావులు ప్రసంగిస్తారు. ఎస్‌సీఈఆర్‌టీ ప్రాంగణంలోని గోదావరి హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు నిర్వహిస్తామని, అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కమిషన్ తెలిపింది.