తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు ఎగ్ బిర్యానీని మధ్యాహ్న భోజనంగా ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా మెనూలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీలున్నప్పుడల్లా చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో మొదటి రోజు ఎగ్ బిర్యానీని చిన్నారులకు వడ్డించారు.