అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల వీటి ధరలు 15 శాతం పెరగ్గా ఈ ఏడాదిలో మరో 20 శాతం పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో అనేక స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ‘నో ఎగ్స్’ బోర్డులు పెడుతుండగా మరి కొన్ని చోట్ల ఒక్కరికి గరిష్ఠంగా రెండు, మూడు ట్రేలు మాత్రమే ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గుడ్ల లభ్యత తగ్గడమే దీనికి కారణంగా తెలుస్తోంది.