ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, BRS MLC కవిత డిమాండ్ చేశారు. HYD-ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. 50 వేల ఎరుకల కుటుంబాలకు రూ 60 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఎరుకల ఎంపవర్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యధాతధంగా అమలు చేయాలన్నారు. చరిత్రలో నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడి విగ్రహాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసుకుందామన్నారు.