తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో మూడు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు EC షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 10 తుది గడువుగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.