తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని MLC కవిత డిమాండ్ చేశారు. BC బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగానే ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. 'కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి CMకు నేర్పించానని రేవంత్ చెప్పుకుంటున్నారు. CM ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ ఫోటో విడుదల చేసింది. ఆ ఫోటోలో రేవంత్ లేరు. దీన్ని బట్టే రేవంత్ ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్థమవుతోంది' అని దుయ్యబట్టారు.