మసాచుసెట్స్ ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం వరకు 130 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిక్ విమానంలో ప్రయాణానికి ట్రయల్స్ జరిగాయి. పూర్తిగా ఎలక్ట్రిక్ సామర్థ్యంతో నడిచే అలియా సీఎక్స్ 300 విమానాన్ని బీటా టెక్నాలజీస్ అనే ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది. కాగా 130 కిలోమీటర్లకు కేవలం రూ.694 ఖర్చు మాత్రమే అయిందని తెలిపింది. ఇదే దూరానికి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తే రూ.13885 ఖర్చు అవుతుందని తెలిపింది.