జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది. అయితే స్కూటర్ డిక్కీలో పెట్టిన రూ.1.90 లక్షలు కాలిపోవడంతో బాధితుడు తిరుపతి రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాలలోనే స్కూటర్ బ్యాటరీ పేలిపోయిందని, స్కూటర్ కొని రెండు నెలలు కూడా కాలేదని బాధితుని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వరిని అమ్మగా వచ్చిన డబ్బులు స్కూటర్ డిక్కీలో పెట్టినట్లు తెలిపారు.