కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం)లో భాగంగా వారికి ఒక నెల జీతం ముందుగా వాయిదా పద్ధతిలో చెల్లించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ మొత్తాన్ని 3 వాయిదాల్లో (గరిష్ఠంగా రూ.15000) అందించనుంది. అయితే ELIకి అర్హత సాధించిన వారందరూ ఈ నెల 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ పూర్తి చేయాలని EPFO తెలిపింది.