WPL: ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్.. గుజరాత్ లక్ష్యం 214
By Gaddala VenkateswaraRao 54చూసినవారుమహిళల ప్రిమియర్ లీగ్‌లో కీలక మ్యాచ్ జరుగుతోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ (77; 41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టారు. చివర్లో కెప్టెన్ ప్రీత్ కౌర్ (36; 12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది.