‘ది అమెరికా పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన మస్క్‌

10చూసినవారు
‘ది అమెరికా పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన మస్క్‌
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికాలో ‘ది అమెరికా పార్టీ’ అనే పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తూ జులై 6న Xలో పోస్ట్ చేశారు. జులై 4న Xలో నిర్వహించిన ఓటింగ్‌లో 65.4% మంది మద్దతు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “మీ స్వేచ్ఛను మీకు తిరిగి ఇవ్వాలన్నదే ‘ది అమెరికా పార్టీ’ లక్ష్యం” అని మస్క్ చెప్పుకొచ్చారు. ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’కు ఆమోదం తెలిపితే కొత్త పార్టీ ప్రకటిస్తానని ఇటీవల మస్క్‌ చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్