ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 17 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ ఒక విధమైన ఉద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన కేజ్రీవాల్ తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు. అనంతరం సునీతా కేజ్రీవాల్, పిల్లల్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయనను చూసి వారు భావోద్వేగానికి లోనయ్యారు. సిసోడియాను చూడగానే సంతోషంతో పొంగిపోయారు.