మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో రాకెట్ లాంఛర్, గ్రెనేడ్, 315 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారి కోసం భద్రతా బలగాలుగాలింపు చర్యలు చేపట్టాయి.