జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహిళ సహా ఇద్దరు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. సోనువా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుండి రెండు ఐఎన్‌ఎస్‌ఎఎస్ రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కొల్హాన్ రేంజ్ డీఐజీ మనోజ్ రతన్ ఛోటే తెలిపారు.