జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా నాదిర్ గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు ఆ ప్రాంతంలోని ఓ భవనంలో నక్కినట్లు సమాచారం రాగా సైనికులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. భీకర పోరులు ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.