జమ్మూకశ్మీర్‌లోని చత్రు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ వీరమరణం పొందినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.