బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కెప్టెన్ గిల్(161) సూపర్ సెంచరీతో అదరగొట్టగా, జడేజా (69), పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి 427 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్, బషీర్ చెరో 2 వికెట్లు, రూట్, బ్రైడన్ తలో వికెట్ తీశారు.