బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్ 64/1 స్కోర్‌తో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులో కేఎల్ రాహుల్ (39), కరుణ్ నాయర్ (17) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై 266 పరుగుల ఆధిక్యం ప్రదర్శిస్తోంది.