ఐదో రోజు వర్షం కారణంగా గంటన్నరకుపైగా నిలిచిన భారత్ VS ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. 10 ఓవర్లు కోత విధించి, 80 ఓవర్లలో ఆట నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఇంగ్లాండ్ గెలవాలంటే 536 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలుపునకు 7 వికెట్లు అవసరం. దీంతో ఇంగ్లాండ్ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 74/3. క్రీజులో పోప్(24), బ్రూక్ (17) ఉన్నారు.