ENG vs IND: 125 బంతుల్లోనే ఓలీ పోప్ సెంచరీ (వీడియో)

57చూసినవారు
లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ సాధించారు. భారత్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఓలీ పోప్ కేవలం 125 బంతుల్లోనే 13 ఫోర్లతో 100 పరుగులు పూర్తిచేసుకున్నారు. బుమ్రా వేసిన 46.2 ఓవర్‌కు సింగిల్ తీసి టెస్టుల్లో 9వ శతకం అందుకున్నాడు. దీంతో 47 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్ 206/3గా ఉంది. క్రీజులో ఓలీ పోప్ (100), హ్యారీ బ్రూక్(0) ఉన్నారు. 

Credits: ECB

సంబంధిత పోస్ట్