ENG vs IND: నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ 72/3

4చూసినవారు
ENG vs IND: నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ 72/3
అండర్సన్‌-టెండూల్కర్‌ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. 64/1తో ఆటను ఆరంభించిన భారత్ 427/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 కలుపుకుని 608 పరుగుల భారీ టార్గెట్‌ని ఇంగ్లండ్‌ ముందు ఉంచింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 72/3 స్కోరుతో నిలిచింది. బ్రూక్ (15*), ఓలీ పోప్ (24*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఇంకా 536 పరుగుల వెనుకంజలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్