TG: రాష్ట్రవ్యాప్తంగా జులై మొదటివారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అనుమతి లేకుండా నడుపుతున్న నాలుగు విద్యాసంస్థలకు నోటీసులిచ్చినట్లు బాలకృష్ణారెడ్డి చెప్పారు. ఇంజినీరింగ్ సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.