నాగపూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఇంగ్లాండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాల్ట్, డకెట్ ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ 10 ఓవర్లకే 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో హర్షిత్ రాణా వేసిన 10 ఓవర్‌లో సాల్ట్ రన్ అవుట్ కాగా, డకెట్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం జోరూట్ (1*) బట్లర్(0*) క్రీజులో ఉన్నారు.