బాలికలతో కారు కడిగించిన ఇంగ్లీష్ టీచర్ (వీడియో)

74చూసినవారు
AP: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కారు కడిగించడం వివాదాస్పదమైంది. తూ.గో. జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఇంగ్లీష్ టీచర్ డి.సుశీల తన కారును విద్యార్థినులతో కడిగిస్తున్న వీడియో నెట్టింట వైరలయింది. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్