విశిష్టంగా కన్నయ్య పవళింపు సేవ
By Potnuru 75చూసినవారుశ్రీకృష్ణ జన్మాష్టమి నాడు నల్లనయ్య పవళింపు సేవనూ విశిష్టంగా జరుపుతారు. బాలకృష్ణుణ్ని ఊయలలో పడుకోపెట్టి, హారతిచ్చి కీర్తనలు, జోలపాటలు పాడుతూ, భజన చేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటారు. శ్రీకృష్ణాష్టమి నాడు పరమాత్ముడికి ఇష్టమైన పరమాన్నం, పాలు, పెరుగు, వెన్నపూస, బెల్లం, మీగడ, జున్ను, పండ్లు, అటుకులు నివేదనగా సమర్పిస్తారు. స్వామికి వెన్నెల విహారం ఉల్లాసభరితం. అందుకే ఎక్కువగా రాత్రివేళలోనే అర్చనలు, నివేదనలు, భజనలు నిర్వహిస్తారు.