సీఎం రేవంత్ రెడ్డిని శనివారం మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు.