'కాళేశ్వరం' కమిషన్ ముందు ఈటల, హరీశ్ రావు అబద్ధాలు చెప్పారని పేర్కొంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జస్టిస్ ఘోష్ కమిషన్‌కు లేఖ రాశారు. 'కాళేశ్వరానికి, మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు. 2016 ఫిబ్రవరిలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంది. 2016 మార్చి 1న మేడిగడ్డకు పరిపాలనాపరమైన అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2016 మార్చి 15న హరీశ్‌రావు చైర్మన్‌గా, నేను, ఈటల సభ్యులుగా ఉపసంఘంలో ఉన్నాం' అని లేఖ్హలో పేర్కొన్నారు.