TG: ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలవడానికి బుధవారం ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆమె వెళ్లే సమయానికి కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు బయటకు వచ్చారు. అక్కడే ఉన్న కుమార్తెను పలకరించకుండా కేసీఆర్ నేరుగా వాహనం ఎక్కి బీఆర్‌కే భవన్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కవిత లేఖ వ్యవహారం, వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను కేసీఆర్ దూరం పెట్టారనే చర్చ జరుగుతోంది.