వైసీపీ నేతలపై టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వంశీ అంటే అరాచకత్వం, అవినీతికి మారుపేరని, అలాంటి నాయకులను జగన్ వెనకేసుకొస్తున్నారని అన్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసినందకు ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేశారని, దళితులంటే వైసీపీకి చిన్న చూపని ఆరోపించారు. గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినా వైసీపీ నాయకుల, జగన్ బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.