ఎంత పెద్ద విమాన ప్రమాదం జరిగినా ముందుగా వెతికేది బ్లాక్ బాక్స్ కోసం. విమానం పూర్తిగా కాలిపోయినా ఇది దెబ్బతినకుండా సురక్షితంగా ఉంటుంది. దీన్ని టైటానియంతో తయారు చేసి, దృఢమైన పెట్టెలో భద్రపరుస్తారు. విమానం కూలిన తర్వాత నెల రోజుల వరకూ సిగ్నల్స్ పంపే సామర్థ్యం ఉండే లొకేటర్ బీకాన్ ఇందులో ఉంటుంది. ఇది నీటిలో పడినా సిగ్నల్ పంపుతుంది. బ్లాక్ బాక్స్‌ను త్వరగా గుర్తించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవచ్చు.