మిడిల్ క్లాస్, మీడియం రేంజ్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై అసలు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకుంటే ఈ మొత్తం రూ.12.75 లక్షలకు పెరుగుతుంది. అంటే సగటున ప్రతి నెలా రూ. లక్ష జీతం ఉన్నప్పటికీ అస్సలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు.