ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి చెందినప్పటికీ కల్కాజీ నియోజకవర్గం నుంచి సీఎం ఆతిశీ విజయం సాధించారు. 3,521 ఓట్ల మెజారిటీతో ఆతిశీ గెలుపొందారు. దీంతో పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె మద్దతుదారులు, కార్యకర్తలతో కలిసి ఉల్లాసంగా.. ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. మ్యూజిక్‌కు తగినట్టుగా నృత్యం చేశారు. ఈ విధంగా ఆతిశీ తన డాన్స్‌తో ఆప్ కార్యకర్తలను ఉత్తేజపరిచారు.