చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం: వైద్యులు

58చూసినవారు
చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం: వైద్యులు
AP: చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి రావచ్చని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రమణ యశస్వి తెలిపారు. అయితే వారు త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. అకస్మాతుగా చేతులు, కాళ్లు నీరసంగా ఉంటాయని చెప్పారు. కోనసీమ జిల్లా, నరసరావుపేట, ప్రకాశం జిల్లా నుంచి ఈ వ్యాధి బాధితులు ఇక్కడకు వచ్చారని, చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నారని ఆయన తెలిపారు. GBS గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, తాము చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్