TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో అందరూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. AI ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించిన వారిపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగానే.. అందరూ వాటిని డిలీట్ చేశారని తెలిపారు. ఒక ఫారెస్ట్ ల్యాండ్‌లో బుల్డోజర్లు నడుపుతుంటే జింకలు మెషిన్ల మీది నుంచి దూకిపోతున్నట్లు.. సింహాలు, ఏనుగులన్నీ అడ్డమొచ్చి జరుపుతున్నట్లు ఫేక్ వీడియోలు చేశారన్నారు.