కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోందని, సింధూ జలాల నిలిపివేతపై యథాతథస్థితి కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని, పాక్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని అన్నారు. భారత్-పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్‌పార్టీ జోక్యం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.