రథసప్తమి వేడుకలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహనాలపై శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమాడ వీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మాడ వీధుల్లో ఏర్పాట్లను సోమవారం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.