తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్క గ్రామ పాలన ఆఫీసర్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వారందరికీ ఈ నెల 25న స్క్రీనింగ్ పరీక్ష పెట్టనున్నారు ఎలాగూ పోస్టుల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువే ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగానే జీపీవోల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.