మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. జగన్ బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో పర్యటించనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. అయితే జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా తమ అధినేత గుంటూరులో పర్యటిస్తారని వైసీపీ శ్రేణులు ఢంకా బనాయించి చెప్పడంతో.. జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.