విద్యార్థులు, యువత అధికంగా బెట్టింగ్ యాప్‌ల బారిన పడుతున్నారని BRS నేత హరీశ్ రావు అన్నారు. అలా చేయడం సరికాదని, బెట్టింగ్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. కొందరు కుటుంబ సభ్యులను చంపేసి తమ ప్రాణాలు తీసుకుంటున్నారని.. ఇలాంటి పనులు అస్సలు చేయద్దన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశ మంచిది కాదని చెప్పారు. శ్రీ రాముడిని ఆదర్శంగా తీసుకుని అందరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.