చిక్కుడుకాయ తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చిక్కుడుకాయలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్‌తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె సమస్యలు, క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి. ఇంకా జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఔషధంలా పని చేస్తుంది.