ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని వెండి కర్మాగారంలో మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన పేలుడు సంభవించింది. మూడు ఫర్నేసులు ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో కర్మాగారంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.